తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

18
cm kcr

రాష్ట్ర మంత్రివర్గం సోమవారం ప్రగతి భవన్ లో సమావేశమై ఈ కింది నిర్ణయాలు తీసుకున్నది.

-ద తెలంగాణ అబాలిషన్ ఆఫ్ ద పోస్ట్స్ ఆఫ్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ బిల్, 2020 ని ఆమోదించింది.

-ద తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ని ఆమోదించింది.

-తెలంగాణ మున్సిపాలిటీ యాక్టు -2019లోని సవరణ బిల్లును ఆమోదించింది.

-పంచాయతీ రాజ్ & రూరల్ డెవలప్మెంట్ –గ్రామ పంచాయత్స్ – ట్రాన్స్ ఫర్ ఆఫ్ నాన్ అగ్రికల్చరల్ ప్రాపర్టీ యాక్టు – 2018 సవరణ బిల్లును ఆమోదించింది.

-తెలంగాణ జి.ఎస్.టి. యాక్టు -2017 లో సవరణ బిల్లును ఆమోదించింది

-తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్టు అమెండ్మెంట్ ఆర్డినెన్స్-2020ని ఆమోదించింది

-ద తెలంగాణ డిజాస్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆర్డినెన్స్ -2020 ను కేబినెట్ ఆమోదించింది

-ద తెలంగాణ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ బిల్ -2002ని ఆమోదించింది.

-ఆయుష్ మెడికల్ కాలేజీల్లో అద్యాపకుల పదవీ విరమణ వయో పరిమితిని పెంచే ఆర్డినెన్స్ ను ఆమోదించింది.

-టిఎస్ బిపాస్ బిల్ ను ఆమోదించింది.

-తెలంగాణ కోర్ట్ ఫీజ్ అండ్ సూట్స్ వాల్యుయేషన్ యాక్టు -1956 సవరణ బిల్లును ఆమోదించింది.

-ద తెలంగాణ సివిల్ కోర్ట్స్ యాక్టు -1972 కు సవరణ బిల్లును ఆమోదించింది

-కొత్త సెక్రటేరియట్ నిర్మాణం, పాత సెక్రటేరియట్ కూల్చివేతకు అయ్యే వ్యయాలకు సంబంధించిన పరిపాలనా అనుమతులను కేబినెట్ ఆమోదించింది

-కొత్తగా నిర్మించే ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్స్ ఆఫీస్ కాంప్లెక్సులకు నిధుల కేటాయింపు కోసం సవరించిన పరిపాలనా అనుమతులు ఇచ్చింది.

  • 17 కులాలను బిసి జాబితాలో చేర్చాలని బిసి కమిషన్ చేసిన సిఫారసులను కేబినెట్ ఆమోదించింది.