బిగ్ బాస్ ఎపిసోడ్ 2..హైలైట్స్!

205
big boss

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రెండోరోజు అసలు ఆట మొదలెట్టేశారు కంటెస్టెంట్లు. తొలిరోజు పరిచయాలు, ప్రేమలు పంచుకున్న బిగ్ బాస్ ఇంటి సభ్యులు రెండో రోజు రచ్చ రచ్చ చేశారు. కరాటే కల్యాణి వర్సెస్ జోర్దార్ సుజాత మధ్య గొడవ జరుగగా సభ్యుల ఓదార్పు మధ్య రెండోరోజు గడిచిపోయింది. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో భాగంగా గంగవ్వను నామినేట్ చేశారు.

మార్నింగ్ సయ్యా….సయ్యారే సాంగ్‌కు కంటెస్టెంట్లు అదిరే స్టెప్పులేయగా సీక్రెట్ రూమ్‌లో సొహైల్,అరియానా సైతం డ్యాన్స్‌తో రచ్చ చేశారు.అనంతరం కిచెన్‌లో డైరెక్టర్ రాజశేఖర్, సూర్య కిరణ్ తదితరులు కరాటే కళ్యాణిపై జోక్‌లు వేసుకున్నారు.బిగ్ బాస్ గేమ్‌లో భాగంగా స్లిప్‌లో రాసి ఇచ్చిన టాస్క్‌లో భాగంగా మీ ఊరి గురించి చెప్పాలని మొనాల్‌కు స్లిప్ అందించగా తన తండ్రి చనిపోయిన విషయాన్ని చెబుతూ బోరున విలపించింది. దీంతో గంగవ్వ కన్నీళ్లు పెట్టగా మొహబూబ్ దిల్ సే సైతం తన తల్లిదండ్రులకు గుర్తు తెచ్చుకుని కంటతడిపెట్టారు.

ఇక సీక్రెట్ రూంలో ఉన్న సొహైల్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కి ఫోన్ చేసి ఫుడ్‌పై ఆర్డర్లు వేయడం మొదలుపెట్టాడు. అయితే ఆ ఫోన్ జోర్దార్ సుజాత లిఫ్ట్ చేయడంతో కరాటే కళ్యాణి ఆమెను కార్నర్ చేసింది. సుజాతకు క్లాస్ పీకడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. ఫోన్ చేసింది బిగ్ బాస్‌ ఆ కాదా అని తెలుసుకోకుండా ఎలా లిఫ్ట్ చేస్తారని ప్రశ్నించిన కళ్యాణి తర్వాత ఫోన్ రావడంతో ఆమె లిఫ్ట్ చేయడం…చెప్పండి బిగ్ బాస్‌ అంటూ మాట్లాడటం కొసమెరుపు.

ఇక ఈ వారం నామినేషన్‌లో భాగంగా సభ్యులు జంటలుగా వెళ్లి తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ వారం నామినేషన్‌కు ఎలిమినేట్ అయిన వారిలో అభిజిత్,సూర్య కిరణ్,అఖిల్,రాజశేఖర్ మాస్టర్,మెహబూబా,సుజాత, గంగవ్వ నామినేట్ కాగా హారిక,టీవీ 9 దేవీ,కరాటే కల్యాణి,దివి,లాస్య,మొనాల్,నోయల్ సేఫ్ జోన్‌లో ఉన్నారు.

ఇందులో ముఖ్యంగా ఆరో జంటగా.. సుజాత, మొనాల్‌లు వెళ్లగా సుజాతను నామినేట్ చేసిన కళ్యాణి రచ్చ రచ్చ చేసింది. ఆవేశంతో ఊగిపోయింది. ఎంతమంది శాంతి పరిచినా కంట్రోల్ కాలేదు కళ్యాణి.బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇవ్వగా.. ఇందులో కరాటే కళ్యాణి టీచర్ అవతారం ఎత్తింది.. ఆమెతో గంగవ్వ ఓ ఆట ఆడుకుంటుంది. ఆ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కానుంది.