రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం..

519
Telangana cabinet meet phots
- Advertisement -

ప్రగతి భవన్‌లో శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, దాని వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల విస్తృతంగా చర్చించే అవకాశం ఉంది. మామిడి, బత్తాయి పండ్ల మార్కెట్లు, వ్యవసాయ కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టం తదితర అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

లాక్ డౌన్ పొడగించే అంశం,భవిష్యత్ వ్యూహ రూపకల్పన,రాష్ట్ర ఆర్ధిక పరిస్ధితులపై చర్చించే అవకాశం ఉంది. రాష్టంలోని పేదలు, ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులకు అందుతున్న సాయంపై చర్చించనున్నారు.

- Advertisement -