ఇవాళ కేబినెట్ కీలక భేటీ

182
Telangana Cabinet meet today
- Advertisement -

ఇవాళ సాయంత్రం 5 గంటలకి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. పలు కీలక అంశాలపై ఈ భేటీలో అమోద ముద్ర వేయనున్నారు. మూడేండ్ల పాలన, భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై మంత్రులతో చర్చించనున్నారు సీఎం కేసీఆర్.రాష్ట్రంలో సరికొత్త వ్యవస్థ ఏర్పాటుకు కావాల్సిన చట్టాలను ఆర్డినెన్సుల రూపంలో అమల్లోకి తేవాలని నిశ్చయించారు.

కీలకమైన చట్టాలను ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చేందుకు డ్రాప్ట్స్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు చట్టం ముసాయిదాలను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలో భూములకు విలువ పెరిగింది. ఇదే అదునుగా శివారు ప్రాంతాల్లో భూమాఫియా అడ్డగోలుగా కబ్జాలు చేస్తూ, దొంగ రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్నది. దీన్ని అరికట్టడానికి జాగీరు భూములను రద్దుచేస్తూ ఆర్వోఆర్ చట్టంలో భారీ మార్పులు తీసుకురావాలని సీఎం నిర్ణయించారు.

ఈనెల 20 నుంచి మొదలయ్యే గొర్రెల పంపణీ పథకంపై కేబినెట్లో చర్చించనున్నారు. గ్యాంబ్లింగ్ , నకిలీ విత్తనాల నిరోధంపై ఆర్డినెన్స్ ను ఆమోదించనుంది కేబినెట్. వర్షాకాలంలో వ్యాపారులు నకిలీ విత్తనాలు, ఎరువులు, కల్తీ పురుగుమందులను రైతులకు అంటగట్టే అవకాశం ఉన్నందున.. వాటిపై కఠినంగా వ్యవహరించాలని, కొత్త చట్టాలు తీసుకొచ్చి కల్తీ సరుకు విక్రయించడానికి భయపడేలా వాటిని అమలు చేయాలని సర్కారు భావిస్తున్నది. ఈ మేరకు పీడీ యాక్ట్‌కు సవరణలు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చే అవకాశం ఉంది.

ఆహార పదార్థాలను కల్తీచేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. పలు ఆర్డినెన్సులను మంత్రివర్గం ఆమోదించనున్నట్టు తెలిసింది.పోలీస్ శాఖలో కొత్తగా పదివేల ఉద్యోగాల భర్తీతో పాటు వైద్యారోగ్యశాఖలోని కొన్ని పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపనున్నట్టు సమాచారం.

- Advertisement -