- Advertisement -
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు . అలాగే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read:మల్లన్న కామెంట్స్‌పై రేవంత్ వివరణ ఇవ్వాలి
రెండో దశ సమగ్ర కులగణనకు మంత్రిమండలి ఆమోదం,ఏపీతో నీటి వివాదం వంటి అంశాలపై చర్చించనుంది కేబినెట్.
- Advertisement -

