ఈ నెల 8న పరేడ్ గ్రౌండ్‌లో జరుగనున్న మహిళా సదస్సు ఏర్పాట్లపై బుధవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమావేశమై సమీక్షించారు. 8వ తేదీ సాయంత్రం కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీ ఎస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభా వేదికకు వచ్చి వెళ్లే మార్గాలు, ప్రధాన వేదిక వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి మహిళా శక్తి పాలసీని విడుదల చేస్తారని, మహిళా సమాఖ్యలకు అందజేయనున్న బస్సులను జెండా ఊపి ప్రారంభిస్తారని ఆమె తెలిపారు.
అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌కు అంతరాయం కల్గకుండా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాల నుంచి వచ్చే బస్సులకు బైసన్‌పోలో మైదానంలో పార్కింగ్ ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ఏరియాల్లో లైటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని సీ ఎస్ ఆదేశించారు. అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. సభకు హాజరయ్యేవారికి సరిపడా తాగునీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. తగినన్ని మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని నిరంతరం పారిశుద్ద్య ఏర్పట్లను పర్యవేక్షించాలని మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. స్టేజీల నిర్మాణం, బారికేడింగ్, లైటింగ్, పార్కింగ్, సీటింగ్ తదితర పనులు ఇప్పటికే ప్రారంభమైనట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.
Also Read:మల్లన్న కామెంట్స్‌పై రేవంత్ వివరణ ఇవ్వాలి

