16న కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

116
cm kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 16న కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్‌ భేటీ జరగనుండగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా ఈ నెల 22 నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సి వ్యూహం, ప్రతిపక్షాల విమర్శలను ఎలా తిప్పికొట్టాలి అన్నదానిపై చర్చించే అవకాశం ఉంది.

దళితబంధుతో పాటు ఇతర కులాలకు కూడా రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం చేసే విధంగా టీఆర్ఎస్‌ సర్కార్‌ ప్లాన్ చేస్తోంది.. వీటిపై కూడా కేబినెట్‌లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. యాదాద్రి నిర్మాణపనులు కూడా పూర్తికావస్తుండడంతో ఆలయ ప్రారంభోత్సవంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఈ నెల 16న జరిగే కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు..

- Advertisement -