సీతగా మారిన కంగనా..!

22
kangana

వరుస సినిమాలతో దూసుకుపోతోంది బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. ప్రస్తుతం కంగనా నటించిన తలైవి విడుదలకు సిద్ధంగా ఉండగా తర్వాత ఇందిరాగాంధీ కథాంశం నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది కంగనా.

తాజాగా అలౌకిక్ దేశాయ్ దర్శకత్వంలో ఎస్.ఎస్. స్టూడియోస్ కు చెందిన సలోని శర్మ నిర్మించబోతున్న ‘ది ఇన్ కారనేషన్ : సీత’ మూవీలో కంగనా రనౌత్ ను ఎంపిక చేసినట్టు ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ కథను అందిస్తున్నారు.

సీత చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. భావితరాలకు సీత చరిత్రను అందచేయడమే లక్ష్యంగా తానీ చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు సలోని శర్మ తెలిపారు.