ఒంటరిగానే పోటీ..జనసేనతో కటీఫ్?

56
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరియు జనసేన పార్టీలు కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ కేవలం ఎనిమిది స్థానాల్లో విజయం సాధించగా జనసేన మాత్రం అసలు ఖాతా కూడా తెరవలేదు. దీంతో జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి ఒరిగిందేమీ లేదనే చెప్పాలి. అయితే మొదట అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని కమలనాథులు చెబుతూ వచ్చారు. తీరా ఎన్నికల సమయానికి పార్టీ బలహీనంగా ఉండడంతో జనసేన పార్టీని కలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్రెడీ ఈ రెండు పార్టీలు ఏపీలో పొత్తులో ఉన్నప్పటికి తెలంగాణలో విడివిడిగానే పోటీ చేయాలని భావించాయి. కానీ అనూహ్యంగా ప్రణాళికలు మార్చుకొని కలిసి పోటీ చేసి చేతులు కాల్చుకున్నాయి.

ఈ నేపథ్యంలో జనసేన కారణంగానే తమకు సీట్లు తగ్గాయనే అపోహ తెలంగాణ బీజేపీలోని ఓ వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారట. ఎందుకంటే ఏపీలో గత పదేళ్ల కాలంగా ఉన్న జనసేన అక్కడ ఏమాత్రం ప్రభావం చూపలేదు. దీంతో పాలిటిక్స్ లో జనసేన పార్టీని ఐరన్ లెగ్ గా విమర్శిస్తుంటారు ఏపీని కొందరు ప్రత్యర్థి నేతలు. మరి అలాంటి పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం వల్లే బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అయిందనేది కొందరి వాదన. ఈ నేపథ్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని బీజేపీ భావిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే జనసేన పార్టీకి దూరంగా ఉండేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. మరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన లోక్ సభ ఎన్నికల బరిలో కూడా నిలుస్తుందేమో చూడాలి.

Also Read:ధరణిలో మార్పులా? రద్దా ?

- Advertisement -