బీజేపీ ఆకర్ష్ బెడిసికొడుతోందే !

179
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు మరో ఏడాదిలో జరగనున్నాయి. అయితే ప్రధాన రాజకీయ పార్టీలు మాత్రం ఇప్పుడే ఎన్నికలు అన్నంతగా పోలిటికల్ హిట్ పెంచుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ టి‌ఆర్‌ఎస్ మద్య సాగుతోన్న రాజకీయ రగడ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో కొత్త చర్చకు తావిస్తోంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చూస్తున్న కాషాయపార్టీ..అడ్డ దారులు తొక్కుతూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్ పార్టే లక్ష్యంగా ఆ పార్టీలోని నేతలకు ఎరవేస్తూ బీజేపీ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. అయితే బీజేపీ కుచలా వ్యూహాలను కే‌సి‌ఆర్ సమర్థవంతంగానే తిప్పికొడుతూ కాషాయ పార్టీకి కోలుకోలేని షాక్ ఇస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కొనుగులు చేసేందుకు ప్రయత్నాలు జరిపి అడ్డంగా బుక్కయ్యారు కమలనాథులు. .

అయితే వారి తప్పెదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినప్పటికీ సి‌ఎం కే‌సి‌ఆర్ ఆధారాలతో సహ బయట పెట్టడంతో బీజేపీ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా తయారైంది. ఇదిలా ఉంచితే ముఖ్యంగా టి‌ఆర్‌ఎస్ ను దెబ్బతీయడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం.. టి‌ఆర్‌ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ను చేరికల కమిటీ చైర్మెన్ గా నియమించింది. అయితే ఈ పదవిని ఈటెలకు అప్పగించడంలో కూడా బీజేపీ వ్యూహం ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గతంలో టి‌ఆర్‌ఎస్ పార్టీలో ఈటెల కీలక నేతగా ఉండడం వల్ల.. ఆ పార్టీలోని అందరి నేతేలతో సత్సంధాలు కలిగి ఉండే అవకాశం ఉంది. దాంతో ఈటెల ద్వారా టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను మరియు నేతలను కాషాయ పార్టీలోకి లాగే ప్రయత్నం చేయవచ్చని కమలనాథులు అంచనా వేశారు. అందుకు తగ్గటూగానే పెద్దఎత్తున చేరికలు ఉంటాయని ఈటెల కూడా వ్యాఖ్యానిస్తూ వచ్చారు.

అయితే అవన్నీ తాటాకు చప్పులే అనేది ఎప్పటికప్పుడు స్పష్టమౌతునే వస్తోంది. ప్రాణం పోయిన పార్టీని విడిచే ప్రసక్తే లేదని టి‌ఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రుజువు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేల కొనుగులు విషయంలో టి‌ఆర్‌ఎస్ ఎమ్మేల్యేలు అచ్చం పేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రెగ కాంతరావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.. వంటి వారు బీజేపీ ఆకర్ష్ ను ఎలా తిప్పికొట్టారో అందరికీ తెలిసిందే. ఇక చావనైనా చస్తాం గాని ప్రభుత్వాన్ని విడిచే ప్రసక్తే లేదని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి వారు కూడా పార్టీ పైన, ప్రభుత్వంపైనే విధేయత చూపుతూనే ఉన్నారు. దీంతో ఈటెల కేంద్రంగా మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తుస్సుమంటోందని పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. మొత్తానికి సమర్థవంతమైన కే‌సి‌ఆర్ నాయకత్వంలో టి‌ఆర్‌ఎస్ నేతలు, ఎమ్మేల్యేలు ఇతర పార్టీవైపు చూసే ప్రసక్తే లేదనేది వాస్తవం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -