దృశ్యం 3..బాక్సాఫీస్ షేక్!

7
- Advertisement -

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో సరికొత్త సంచలనాలు సృష్టిస్తున్న మోస్ట్ అవేటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’. బాక్స్ ఆఫీస్ ను ఈ సినిమా షేక్ చేస్తోంది. ఏడో రోజు ఈ చిత్రం వసూళ్లలో ఏకంగా 23 శాతం వృద్ధిని కనబరచడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

తాజా నివేదికల ప్రకారం.. వర్కింగ్ డే అయినప్పటికీ ఈ సినిమాకు ఆడియన్స్ నుండి లభిస్తున్న మౌత్ టాక్ కారణంగా థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడో రోజు సాధించిన కలెక్షన్లతో కలిపి ఈ చిత్రం కేవలం వారం రోజుల్లోనే దేశంలో మొత్తంగా రూ. 87.38 కోట్ల భారీ వసూళ్లను సాధించి రూ. 100 కోట్ల క్లబ్‌ వైపు శరవేగంగా దూసుకెళ్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 180 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దృశ్యం’ సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఈ మూడో భాగానికి కొండంత అండగా నిలిచింది. జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈసారి పోలీసుల నుండి ఎలాంటి ఎత్తుగడలు వేశాడనే ఉత్కంఠభరితమైన కథాంశం ప్రేక్షకులను థియేటర్లలో సీట్ల అంచున కూర్చోబెడుతోంది. రెండో వారంలో కూడా ఈ చిత్రానికి గట్టి పోటీ లేకపోవడంతో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని బాక్స్ ఆఫీస్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Also Read:పద్మనాభస్వామి ఆలయంలో వజ్రాలు మాయం!

- Advertisement -