దిగజారిన బిజెపి ప్రతిష్ట

135
- Advertisement -

అందుకే పార్టీని వీడుతున్న ప్రముఖులు
మునుగుతున్న పడవ బిజేపి
బిజేపీలో భవిష్యత్తు లేదంటున్న నేతలు
పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన కేంద్రం పాలన
భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు, ప్రతిష్టలు దిగజారాయని, అందుకే సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ప్రొఫెసర్ దాసోజు శ్రావ లే కాకుండా ఇంకా అనేకమంది సీనియర్ నాయకులు బి.జె.పి.కి రాజీనామాలు చేస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటడం, దేశంలో ఆహార కొరత సమస్యలు తీవ్రంగా ఉండటం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చిన అపవాదును బి.జే.పి. మూటగట్టుకొందని, ఇప్పటికిప్పడు ఎన్నికలు వస్తే దేశ ప్రజలు ఘోరంగా ఓడిస్తారని, ఇలాంటి మునుగుతున్న పడవలో ప్రయాణించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశ్యంతోనే కమలం పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు రాజీనామాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాములమ్మగా ప్రసిద్ధిగాంచిన సినీనటి విజయశాంతి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా త్వరలో టి.ఆర్.ఎస్. (బి.ఆర్.ఎస్) పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బి.జె.పి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతోందని, అందుకే ఈ తరహా నేతలందరూ కమలం పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, ఓటుతో బి.జె.పి.ని మట్టికరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందని, ఇలాంటి వాస్తవాలు తెలిసి కూడా ఇంకా ఆ పార్టీలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని నేతలు భావిస్తున్నారని తెలిపారు. అంతేగాక మునుగోడు ఉప ఎన్నికల్లో బి.జె.పి. సిద్ధాంతాలను గాలికి వదిలేసి మద్యం, మాంసం, మనీ (మూడు “ఎం”)లను నమ్ముకొని ముందుకు పోతోందని, ఈ పద్దతులు బి.జె.పి. విధానాలే కావని, కానీ నేడున్న నేతలు పార్టీని భ్రష్టుపట్టించారని, అందుకే పార్టీని విడిచిపెట్టక తప్పడం లేదని దాసోజు శ్రావణ్ శుక్రవారం బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిన లేఖతో స్పష్టమయ్యిందని అంటున్నారు.

ఈ తరహా అభిప్రాయాలు ఒక్క దాసోజు శ్రావణికే పరిమితం కాదని, దాదాపు చిన్న చిన్న కార్యకర్తల దగ్గర్నుంచి సీనియర్ నాయకుల వరకూ అందరూ బాధపడుతూనే ఉన్నారని, కాకుంటే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఎవ్వరూ బయటపడటం లేదని,కానీ దాసోజు శ్రావణ్ రాసిన లేఖ సారాంశం నూటికి నూరు పాళ్ళూ కరెక్టేనని అంగీకరిస్తున్నారు. బి.జె.పి. అధికారంలోకి రాకముందు లీటర్ పెట్రోల్ ధర 55 దిగజారిన బిజెపి ప్రతిష్ట అందుకే పార్టీని వీడుతున్న ప్రముఖులు మునుగుతున్న పడవ బిజేపి బిజేపీలో భవిష్యత్తు లేదంటున్న నేతలు పార్టీ ప్రతిష్టను దెబ్బతీసిన కేంద్రం పాలన భారతీయ జనతాపార్టీకి రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా పేరు, ప్రతిష్టలు దిగజారాయని, అందుకే సీనియర్ నాయకులు పార్టీని వీడేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ప్రొఫెసర్ దాసోజు శ్రావ లే కాకుండా ఇంకా అనేకమంది సీనియర్ నాయకులు బి.జె.పి.కి రాజీనామాలు చేస్తారనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆకాశాన్నంటిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలనంటడం, దేశంలో ఆహార కొరత సమస్యలు తీవ్రంగా ఉండటం, అంతర్జాతీయంగా దేశ ప్రతిష్టను దిగజార్చిన అపవాదును బి.జే.పి. మూటగట్టుకొందని, ఇప్పటికిప్పడు ఎన్నికలు వస్తే దేశ ప్రజలు ఘోరంగా ఓడిస్తారని, ఇలాంటి మునుగుతున్న పడవలో ప్రయాణించడం శ్రేయస్కరం కాదనే ఉద్దేశ్యంతోనే కమలం పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు రాజీనామాలు చేసేందుకు సమాయత్తమవుతున్నారని తెలుస్తోంది.

ఎమ్మెల్యే రఘునందన్ రావు, రాములమ్మగా ప్రసిద్ధిగాంచిన సినీనటి విజయశాంతి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వంటి సీనియర్ రాజకీయ నాయకులు కూడా త్వరలో టి.ఆర్.ఎస్. (బి.ఆర్.ఎస్) పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బి.జె.పి. ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతోందని, అందుకే ఈ తరహా నేతలందరూ కమలం పార్టీని వీడేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నారని కొందరు సీనియర్ నాయకులు వివరించారు. కానీ దేశవ్యాప్తంగా ప్రజలు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారని, ఓటుతో బి.జె.పి.ని మట్టికరించడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ విషయాన్ని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా కేంద్ర ప్రభుత్వానికి నివేదించిందని, ఇలాంటి వాస్తవాలు తెలిసి కూడా ఇంకా ఆ పార్టీలో ఉంటే రాజకీయంగా భవిష్యత్తు ఉండదని నేతలు భావిస్తున్నారని తెలిపారు. అంతేగాక మునుగోడు ఉప ఎన్నికల్లో బి.జె.పి. సిద్ధాంతాలను గాలికి వదిలేసి మద్యం, మాంసం, మనీ (మూడు “ఎం”)లను నమ్ముకొని ముందుకు పోతోందని, ఈ పద్దతులు బి.జె.పి. విధానాలే కావని, కానీ నేడున్న నేతలు పార్టీని భ్రష్టుపట్టించారని, అందుకే పార్టీని విడిచిపెట్టక తప్పడం లేదని దాసోజు శ్రావణ్ శుక్రవారం బి.జె.పి.రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు రాసిన లేఖతో స్పష్టమయ్యిందని అంటున్నారు. ఈ తరహా అభిప్రాయాలు ఒక్క దాసోజు శ్రావణికే పరిమితం కాదని, దాదాపు చిన్న చిన్న కార్యకర్తల దగ్గర్నుంచి సీనియర్ నాయకుల వరకూ అందరూ బాధపడుతూనే ఉన్నారని, కాకుంటే పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఎవ్వరూ బయటపడటం లేదని, కానీ దాసోజు శ్రావణ్ రాసిన లేఖ సారాంశం నూటికి నూరు పాళ్ళూ కరెక్టేనని అంగీకరిస్తున్నారు.

బి.జె.పి. అధికారంలోకి రాకముందు లీటర్ పెట్రోల్ ధర 55 రూపాయలుంటే నేడు 108 రూపాయలకు చేరిందని, డీజిల్ లీటర్ 45 రూపాయల నుంచి 97 రూపాయలకు పెరిగిందని, అదే విధంగా 480 రూపాయలున్న వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పడు 1200 రూపాయలకు చేరిందని…ఈ ధరల పుణ్యమా అంటూ నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్నంటాయని జనం మండిపడుతున్నారని పలువురు బి.జె.పి. నాయకులే మండిపడుతున్నారు. పేదలు వినియోగించే పెట్రోల్ లీటర్ ధర 108 రూపాయలుంటే ధనికులు తిరిగే విమానాల్లో వాడే ఫ్యూయల్ ధర లీటర్ 78 రూపాయలు మాత్రమే ఉందని, ఇలాంటి చర్యల మూలంగా బి.జె.పి.పాలనలో పేదలను కొట్టి పెద్దలకు పెడుతున్నట్లుగా ఉందని, ఈ అంశాలు ముమ్మాటికీ ప్రజల్లో పార్టీ ప్రతిష్టను మంటగలిపాయని ఆ నేతలు మదనపడుతున్నారు. ఇలాంటి అంశాలనే ప్రతిపక్ష పార్టీలు విమర్శస్తాలుగా సంధించి బి.జే.పి.ని ఇరకాటంలోకి నెట్టాయని వారు అంగీకరిస్తున్నారు. ఇక పన్నుల పేరుతో దేశ ప్రజల రక్తాన్ని తాగుతున్నట్లుగా లక్షలాది కోట్ల రూపాయలను వసూలు చేస్తున్నారని, అసలే జి.ఎస్.టి.వసూళ్ళతోనే జనం నానా అవస్థలు పడుతుంటే దానికి అదనంగా సెస్, సర్ చార్జీల పేరుతో రికార్డుస్థాయిలో 27 లక్షల కోట్ల రూపాయల నిధులను రాబట్టుకొన్న కేంద్ర ప్రభుత్వం అప్పల పేరుతో మరో 80 లక్షల కోట్ల రూపాయల నిధులను సమకూర్చుకొందని, ఇప్పడు దేశం అప్పలు 155 లక్షల కోట్ల రూపాయలకు చేరాయని, ఇవ్న ప్రజలకు అర్ధమవుతూనే ఉన్నాయని, జనానికి ఇవ్వనీ తెలియదని ఇప్పటికీ మతాల పేరుతో విడదీసి రాజకీయాలు చేద్దామనే ఆలోచనతో బి.జె.పి. అధిష్టానం మూర్ఖంగా ముందుకు పోతోందని, ఇలా అన్ని కోణాల నుంచి లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే సీనియర్ నేతలు కమలం పార్టీని వదిలిపెట్టి జనరంజకంగా పాలన సాగిస్తున్న టి.ఆర్.ఎస్. పార్టీ వైపు చూస్తున్నారని ఆ నాయకులు వివరించారు. అంతేగాక తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను కూడా ప్రజలు గుర్తుపెట్టుకొన్నారని, వేల కోట్ల రూపాయల నిధులను రాకుండా చేసి ఆర్ధికంగా దెబ్బతీస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రజలు అర్ధం చేసుకొన్నారని అంటున్నారు. అందుకే మునుగోడు నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా బి.జె.పి.అభ్యర్ధికి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలు ప్రజల్లో బి.జె.పి.కున్న ర్లా ఉందో, కమలం పార్టీని జనం ఇంతలా వ్యతిరేకిస్తారని తాము కలలో కూడా ఊహించలేదని అంటున్నారు. అందుకే బి.జె.పి.లోని సీనియర్ నేతలు కారెక్కేందుకు ముందుకు వస్తున్నారని వివరించారు.

- Advertisement -