తెలంగాణ బీజేపీ…14 కమిటీలు

26
- Advertisement -

తెలంగాణ బీజేపీ ఎన్నికల క్షేత్రంలోకి దిగిపోయింది. 14 ఎన్నికల కమిటీలను ప్రకటించింది బీజేపీ. ఇక పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతున్న నేతలకు ఈ కమిటీల్లో కీలక బాధ్యతలను అప్పగించింది.
వివేక్ వెంకట్ స్వామి, రాజగోపాల్ రెడ్డి,విజయశాంతి వంటి నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన పదాధికారుల సమావేశం జరుగుతుండగా ఇందులో 40 రోజుల పార్టీ కార్యక్రమాల ప్రణాళికను సిద్ధం చేయనున్నారు. ఇక బీజేపీ ప్రకటించిన ఎన్నికల కమిటీలను ఓసారి పరిశీలిస్తే..

1. సోషల్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డాక్టర్ కె. లక్ష్మణ్ (ఎంపీ)
కన్వీనర్ బొర్రా నర్సయ్యగౌడ్ (మాజీ ఎంపీ)

2. పబ్లిక్ మీటింగ్స్ చైర్మన్ బండి సంజయ్ కుమార్ (ఎంపీ)
కన్వీనర్ జి. ప్రేమేందర్ రెడ్డి
జాయింట్ కన్వీనర్ కాసం వెంకటేశ్వర్లు.

3. ఇన్‌ఫ్లుయెన్సర్ ఔట్‌రీచ్‌ కమిటీ చైర్మన్ డీకే అరుణ.
కన్వీనర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి

4. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి.
కన్వీనర్ మహేశ్వర్ రెడ్డి.
జాయింట్ కన్వీనర్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

5. చార్జిషీట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు.
కన్వీనర్ లక్ష్మీనారాయణ (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
జాయింట్ కన్వీనర్ రామచంద్రుడు(రిటైర్డ్ ఐఏఎస్)

Also Read:కరోనా కంటే నిఫా వైరస్ డేంజర్.. జాగ్రత్త!

6. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్.

7. యాక్షన్ కమిటీ చైర్మన్ విజయశాంతి (మాజీ ఎంపీ)
కన్వీనర్ గంగిడి మనోహర్ రెడ్డి

8. సోషల్ మీడియా చైర్మన్ ధర్మపురి అరవింద్
కన్వీనర్ పొరెడ్డి కిషోర్ రెడ్డి

9. ఎన్నికల కమిషన్ ఇష్యూష్ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి
కన్వీనర్ కపిలవాయి దిలీప్ కుమార్

10. హెడ్ క్వార్టర్స్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ నల్లు ఇంద్రసేనా రెడ్డి
కన్వీనర్ బంగారు శృతి

11. మీడియా కమిటీ చైర్మన్ రఘునందన్ రావు,
కన్వీనర్ ఎన్. రామచంద్రరావు. (మాజీ ఎమ్మెల్సీ)
జాయింట్ కన్వీనర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి (బీజేపీ సెక్రటరీ)

12. క్యాంపెయిన్ ఇష్యూ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్.
కన్వీనర్ ఎన్.వి.ఎస్.ఎస్ ప్రభాకర్

13. ఎస్సీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ జితేందర్ రెడ్డి
కన్వీనర్ జి. విజయ రామారావు (మాజీ మంత్రి)

14. ఎస్టీ నియోజకవర్గాల కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ గరికపాటి మోహన్ రావు
కన్వీనర్ సోయం బాపూరావు (ఎంపీ)
జాయింట్ కన్వీనర్ డి. రవీంద్ర నాయక్

Also Read:టైప్ 2 డయాబెటిస్ చాలా ప్రమాదం..జాగ్రత్త!

- Advertisement -