Harishrao:సిద్దిపేటలో గుండె శస్త్ర చికిత్సలు

30
- Advertisement -

ఇకపై గుండెకు సంబంధించిన శస్త్ర చికిత్సలు సిద్దిపేటలోనే చేసుకోవచ్చన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో నిర్మించిన వెయ్యి పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి హరీశ్‌ రావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన హరీష్… దవాఖానలో 15 ఆపరేషన్‌ థియేటర్లు న్నాయని చెప్పారు. నాలుగో ఫ్లోర్‌లో 100 ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. 30 ఎమర్జెన్సీ బెడ్స్‌ ఉన్నాయన్నారు.

తెలంగాణ వచ్చాక వైద్య వ్యవస్థలో విప్లవం తీసుకొచ్చామన్నారు. ఒకప్పుడు డబ్బులు ఉన్నవాళ్లే డాక్టర్లు అయ్యేవారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో రైతులు, కూలీల పిల్లలు కూడా డాక్టర్లు అవుతున్నారని తెలిపారు. గాంధీ, ఉస్మానియా హాస్పిటళ్లలో ఉన్న సేవలు సిద్దిపేటలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు.

రూ.15 కోట్లతో క్యాన్సర్‌ బ్లాక్‌కు శంకుస్థాపన చేశామని..ఇకపై వైద్య సేవలకు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సిద్దిపేటలో డయాలసిస్‌ బెడ్లు 40 పెంచుతున్నామని వెల్లడించారు. రూ.23 కోట్లతో సూపర్‌ స్పెషాలిటీ క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.

Also Read:కరోనా కంటే నిఫా వైరస్ డేంజర్.. జాగ్రత్త!

- Advertisement -