- Advertisement -
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ఆందోళనలకు దిగింది. గులాబీ శ్రేణులు రైతులకు మద్దతుగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
టీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు ఆందోళనలకు దిగారు. రాష్ట్ర,జిల్లా,మండల ,గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టణ కేంద్రాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ రహదారులను దిగ్బంధించారు. రైతులు ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లతో ర్యాలీలు నిర్వహించారు.
ప్రధాన కూడళ్లలో రాస్తారోకోలు నిర్వహించి ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. దుకాణ సముదాయాలు కూడా తెరుచుకోలేదు.
- Advertisement -