అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

931
bathukamma telangana
- Advertisement -

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగగా రెండో రోజు అటుకుల బతుకమ్మ చేస్తారు. పూల అలంకరణ మామూలుగానే ఉన్నా… నైవేద్యాల తయారీ కాస్త భిన్నంగా ఉంటుంది. చప్పటి పప్పు, బెల్లం అటుకులు నివేదిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా పలుదేవాలయాలు, కాలనీలు, వీధులు చెరువుగట్లు సప్తవర్ణ శోభితమయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు అత్యంత భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. సంప్రదాయరీతిలో మహిళలు పట్టుచీరలు, వివిధ రకాల ఆభరణాలు ధరించి బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నారు. బతుకమ్మలు పెట్టి లయబద్దంగా చప్పట్లు కొడుతూ పాడిన బతుకమ్మ పాటలు వాడవాడల మార్మోగాయి.

Bathukamma

దేశరాజధాని ఢిల్లీతోపాటు హైదరాబాద్‌, వరంగల్‌, నల్లగొండ, యాదాద్రి, నిజామాబాద్‌ తో పాటు వివిధ జిల్లాల్లో రంగుల పూల బతుకమ్మలతో పులకించిపోయాయి. పొద్దుపోయే వరకు బతుకమ్మలు ఆడిన మహిళలు వాటినినెత్తిన ఎత్తుకొని సమీప చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. ఆడపడుచులు పసుపు కుంకుమలు పంచుకొని వాయినాలు ఇచ్చుకొని
ఇంటినుంచి తెచ్చుకున్న ఫలహారాన్ని భుజించారు. కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని పలు కళాశాలల్లో విద్యార్థులు కలిసి అధ్యాపక బృందం బతుకమ్మ పాటలు పాడుతూ సంబురాలు చేసుకున్నారు.

- Advertisement -