ఓలా, ఉబర్, రాపిడో బ్యాన్ చేయాలి

14
- Advertisement -

ఓలా,ఉబర్,రాపిడో సర్వీసులను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఓ ఆటో డ్రైవర్. అది కూడా ఎవరో కాదు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడైన ఆటో డ్రైవర్ షేక్ ఖాజాపాష. ఉచిత బస్సు పథకం వల్ల ఆదాయం కోల్పోయి అనేక మంది ఆటో డ్రైవర్లు చనిపోయినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదు అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓలా, రాపిడో, ఉబర్ బ్యాన్ చేసింది, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయం లేక డ్రైవర్లు గోస పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నారు అని మండిపడ్డారు.

వెంటనే ఓలా, రాపిడో, ఉబర్ బ్యాన్ చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Also Read:KTR:పల్లాను పరామర్శించిన కేటీఆర్

- Advertisement -