ఇండియా డే వేడుకల్లో టాక్ తెలంగాణం

15
- Advertisement -

లండన్ లోని భారత హై కమీషన్ మరియు బారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల ప్రవాస సంఘాలతో సంయుక్తంగా భారత 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జరిపిన ” ఇండియా డే వేడుకల్లో”, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) (TAUK), తెలంగాణా రాష్ట్రానికి ప్రాతినిత్యం వహించింది.

భారత హై కమిషనర్ విక్రమ్ దొరై స్వామి ముందుగా జెండా ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన తో కార్యక్రమం ప్రారంభమయ్యింది.ముందుగా తెలంగాణ ప్రత్యేకతతో టాక్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్ ని తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రారంభించడం జరిగింది. యూకే నలుమూలల నుండి వేలాదిమంది మంది ప్రవాస భారతీయులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర ప్రాతినిధ్యం ఉట్టి పడేలా …తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతను, చరిత్రను, బాషా, సంస్కృతి, పర్యాటక ప్రత్యేకత, అభివృద్ధి, గత 10 సంవత్సరాలుగా సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన పథకాలు….ఇలా వీటంన్నింటి సమాచారాన్ని స్టాల్ లో ప్రదర్శించి, హజారయ్యిన వారందరికీ తెలంగాణ ప్రత్యేకత గురించి వివరించారు.

తెలంగాణా రాష్ట్ర ప్రాముక్యత, విశిష్టత గురించి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రవాస భారతీయులకు మరియు ఇతర ఆతిథులకు తెలియజేయాలనే భావన తో, టాక్ సంస్థ ఆద్వర్యం లో తెలంగాణా ప్రముఖులు, సాధించిన విజాయాల తో కూడిన ప్రత్యేక “తెలంగాణా స్టాల్ ” ని ఏర్పాటు చేయడం జరిగిందని సంస్థ కార్యదర్శి రవి రేతినేని తెలిపారు.

ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిత్యం వహిస్తూ కేవలం టాక్ సంస్థ మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని, వ్యక్తిగతంగా ఎంతో బిజీగా ఉన్నపటికీ వాటన్నిటీనీ పక్కన బెట్టి బాధ్యత గల సంస్థగా , తెలంగాణ బిడ్డలుగా ఇందులో భాగ్వములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి, తెలంగాణ ప్రత్యేక స్టాల్ నిర్వాహణకు కృషి చేసి సహకరించిన కార్యవర్గ సభ్యులకు టాక్ సీనియర్ నాయకుడు నవీన్ రెడ్డి కృతఙ్ఞతలు తెలిపారు.

అలాగే వ్యక్తిగత పర్యటన నిమ్మిత్తం లండన్ విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మరియు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ఈ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ఎంతో ప్రోత్సాహాన్ని అందించిస్తునందుకు టాక్ ఉపాధ్యక్షుడు సత్య చిలుముల వారికి ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.

Also Read:శృంగార సామర్థ్యాన్ని పెంచే అనంతాసనం!

స్టాల్ ను సందర్శించిన హై కమీష్నర్ విక్రమ్ దొరై స్వామి , భారత సంతతికి చెందిన మాజీ ఎంపీ వీరేంద్ర శర్మ, ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులు తెలంగాణా సంస్కృతి – సాంప్రదాయాలు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ విజయాలు, పర్యాటక ప్రత్యేకత, చాలా గొప్పగా ఉందని, నూతన రాష్ట్ర సంస్కృతిని, గొప్పతన్నాని, ప్రపంచానికి చూపేట్తాలనే ప్రయత్నం చాలా స్పూర్తి దాయకంగా ఉందని ప్రసంశీంచారు.

స్టాల్ లో ఏర్పాటు చేసిన జాతీయ నాయకుల, తెలంగాణా ప్రముఖుల చిత్ర పాటాలకు నివ్వాలర్పించారు.ప్రవాస తెలంగాణా బిడ్డలు స్టాల్ ని సంధర్షించి, తెలంగాణా కు ప్రత్యేక స్టాల్ ని చూడడం చాలాగర్వంగా ఉందని, తెలంగాణా ప్రాముక్యతను ప్రదర్శితున్న తీరుని అభినందించారు. ఫోటో లతో, సెల్ఫీలతో టాక్ సంస్థ స్టాల్ సందడిగా మారింది. “తెలంగాణా స్టాల్” ని సందర్శించిన ఆతిథులందరికి మన “హైధారాబాద్ బిర్యానీ” రుచిచూపించడం జరిగిందని ముఖ్య నాయకులు సురేష్ బుడగం తెలిపారు.ఈ కార్యక్రమంలో టాక్ కార్యవర్గ సభ్యులు సత్య చిలుముల, వెంకట్ రెడ్డి, సురేష్ బుడగం, రవి రేతినేని, స్వాతి, రవి పులుసు, క్రాంతి రేతినేని తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

- Advertisement -