అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ రిలీజ్…

171
Telangana Assembly

భౌతిక‌దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం, శానిటైజేషన్, ఇతర ముందు జాగ్రత్త చర్యలను నిర్ధారించడానికి ఇప్ప‌టికే చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. అసెంబ్లీ ప్రాంగణంలో సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేయడాన్ని కూడా వారు పరిశీలిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఇందుకు సంబంధించిన నివేదిక‌ను సీఎం కేసీఆర్‌కు స‌మ‌ర్పించ‌నున్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.

సెప్టెంబర్ 7 నుండి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ విడుదలైంది. కరోనా మార్గదర్శకాలను పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.