ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

44
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆరు సార్లు శాసనసభకు ఎంపికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను నియమించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో శనివారం ఆయన ప్రమాణస్వీకారం చేయించనున్నారు. నాలుగో రోజులపాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే వరకు అక్బరుద్దీన్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుండి ప్రారంభమవుతాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక ఉంటుందని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

ఈనెల 9వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణమని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ వివరాలను వెల్లడించిన శ్రీధర్ బాబు.. కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారెంటీలతో పాటు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపాం అన్నారు. ఐదేళ్లలో మార్పు చూపెడతాం అని వెల్లడించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంపులాంటి రెండు గ్యారెంటీలపై సీఎం చర్చించి 9వ తేదీన అమలు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు.

ఈనెల 9వ తేదీన అసెంబ్లీని నిర్వహిస్తాం. ఆరోజు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు. రైతు బంధుకు సంబంధించి ఫైనాన్స్ డిపార్ట్ ‌మెంట్ నుంచి వివరాలు కోరాం అని… వివరాలు రాగానే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం అని స్పష్టం చేశారు.

Also Read:Revanth:సంతకం ఓకే.. మరి అమలు?

- Advertisement -