ఫిబ్రవరి 3 నుండి అసెంబ్లీ సమావేశాలు..

37
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 3 నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మధ్యాహ్నం 12.10 గంటలకు సమావేశాలు ప్రారంభంకానుండగా అదేరోజు బడ్జెట్‌ని ప్రవేశపెట్టనున్నారు.

ఇక ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్ 2023-24 ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ రూ. 3 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ఇక ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. మొత్తం ఈ బడ్జెట్ సమావేశాలు 10 నుంచి 15 రోజుల నుంచి జరిగే అవకాశం ఉంది.

చివరి బడ్జెట్ కావడంతో కొత్త పథకాలకు ఏమైనా అవకాశం ఉంటుందా? లేక ఫెన్షన్లు ఏమైనా పెంచుతారా? అనే చర్చ జరుగుతోంది. వైద్య ఆరోగ్యశాఖలో మౌలిక సదుపాయాల కల్పనకు తోడు కంటి వెలుగు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ గత బడ్జెట్ లో కేటాయించిన దాని కంటే ఈ సారి 8 శాతం నిధులు ఎక్కువగా కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -