జలసౌధలో ముగిసిన ఇంజనీర్ల సమావేశం

487
jalasoudha
- Advertisement -

హైదరాబాద్ లోని జలసౌధ లో కృష్ణనది పరివాహక ప్రాజెక్ట్ ల ఇంజనీర్ల సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమంలో ఎపి,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కృష్ణ నది పరివాక ప్రాంత ప్రాజెక్టుల ఇంజనీర్లు పాల్గోన్నారు.ఇప్పటివరకు వాడుకున్న నీటి వినియోగం, యసంగి పంటకి అవసరమయ్యే నీటి పంపకాల పై చర్చ. జరిగింది.ముఖ్యంగా నాలుగు ప్రధాన అంశాల పై చర్చించారు. పోతిరెడ్డిపాడు, కేసి కెనాల్,ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్,కేడీస్ ఈ నాలుగు ప్రాజెక్ట్ ల నుండి కేటాయింపు ల కంటే ఎపి ఎక్కువ నీటిని వాడుకున్నారు అని తెలంగాణ అధికారులు వాదించారు.

ఎన్సీపీ లెఫ్ట్ కెనాల్ మినహా మిగతా ప్రాజెక్ట్ ల విషయం లో తెలంగాణ ఇరిగేషన్ అధికారుల వాదన తో ఏకీభవావించని ఎపి ఇరిగేషన్ అధికారులు. 15 వ తేదీన ఇఎన్సీల సమావేశం తేల్చుకోవాలని ఇరు రాష్ట్రాల ఇంజనీర్ల అభిప్రాయానికి వచ్చారు. 15 వ తేదిన జరిగే సమావేశం లో వర్కింగ్ మాన్యువల్ పై చర్చించనున్నారు. యసంగి కి కావలసిన నీటి సరఫరా ను నవంబర్ వరకు 150 టీఎంసీల ల నీటి విడుదల చెయ్యాలని ఎపి కోరింది. తెలంగాణకు 79 టీఎంసీల వాటర్ కావలని కోరారు.రేపు నీటి కేటాయింపు ల రిలీజ్ ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -