- Advertisement -
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈనేపథ్యంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం కరోనా కేసుల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో కొత్తగా 114 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 143 మంది కోలుకున్నారు.
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,712 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,94,386 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,625 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,701 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 645 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 24 కరోనా కేసులు నమోదయ్యాయి.
- Advertisement -

