తెలంగాణలో వందశాతం ఫస్ట్ డోస్‌ పూర్తి..

126
vaccination
- Advertisement -

తెలంగాణలో 100 శాతం తొలి డోస్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ పూర్తైనట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. 61 శాతం మందికి రెండు డోస్‌లు పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. గ్రామాల నుంచి నగరాల వరకు వైద్య సిబ్బంది ఎంతో అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, వారి కృషి తోనే వ్యాక్సిన్‌ పంపిణీ ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతోందని వెల్లడించారు.

రెండు సంవత్సరాలు కరోనా ప్రపంచ దేశాలను వణికిస్తుండగా ప్రస్తుతం ఒమిక్రాన్ రూపంలో వణకిస్తోంది. గత వేరియంట్ల కంటే శరవేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే దేశంలో 130 కోట్లకు పైగా కోవిడ్‌ వ్యాక్సిన్‌లను పంపిణీ చేశారు.

- Advertisement -