రైతులకు సెల్యూట్: మెగాస్టార్

44
chiru

జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా స్పెషల్ విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సందర్భంగా ఒక స్పెషల్ వీడియోను పోస్ట్ చేశారు. తన పెరట్లో కొన్ని నెలల క్రితం పొట్లకాయ విత్తనాలను నాటగా, అది పెరిగి, ఇప్పుడు పొట్లకాయలు కూడా అయ్యాయట. ఆ పొట్లకాయలు పట్టుకుని చిరు ఆనందంతో రైతులకు సెల్యూట్ చేశారు.

పెరట్లో ఆనపకాయ కాస్తేనే నాకు ఇంత సంతోషమనిపిస్తే, మట్టి నుంచి పంట పండించి, మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంకెంత సంతోషంగా ఉండాలి అని పేర్కొన్నారు చిరంజీవి. వ్యవసాయం చేస్తూ మనందరికీ సాయం చేస్తున్న ప్రతి ఒక్క రైతు కి నా సెల్యూట్ అని రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రస్తుతం చిరంజీవి నటించిన ఆచార్య ఫిబ్రవరి 4,2022న విడుదల కానుంది.