కరోనా విపత్తులోనూ ఉపాధి..!

1077
narega details
- Advertisement -

గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉపాధి హామీ పథకం..తెలంగాణలో కూలీలకు వరంలా మారింది. సీఎం కేసీఆర్ ముందుచూపు..కరోనా విపత్తు వేళ కూలీల బ్రతుకుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. రోజుకు 12 లక్షల మందికి పైగా కూలీలను పని దొరకుతోంది.

నిర్ణీతదూరం పాటిస్తూ రైతుల భూములు చదును చేయడం, కందకాలు తవ్వడం,పంట కాల్వల పూడిక తీత, కొత్త పంటకాల్వలు,నీటి నిల్వ పనులు వంటివి చేస్తున్నారు. రోజుకు రూ.150 నుంచి రూ.200 దాకా సంపాదిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధిపనుల్లో అవలంబిస్తున్న కనీసదూరం, భద్రతాచర్యలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసించిందంటే ఉపాధి హామీ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

errabelli

ఫీల్డ్ అసిస్టెంట్‌లు లేకున్నా పంచాయతీ కార్యదర్శుల సహకారంతో టెక్నికల్ అసిస్టెంట్లు దగ్గరుండి కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఏపీవో,ఎంపీడీవోలు తగు సూచనలిస్తూ వారి వారి మండలాల్లో అధికంగా కూలీలకు పనులు కల్పించేలా కృషిచేస్తున్నారు. ఎప్పటికప్పుడు డీపీవో,డీఆర్డీవో జిల్లా కలెక్టర్లు సమీక్షలు నిర్వహిస్తూ ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రతి నిరుపేద కుటుంబంకు కూలీ అందించాలనే ధృడ నిశ్చయంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తున్నారు. దీంతో ఉన్న ఊళ్లనే పని దొరుకుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఉపాధి పనిచేసేందుకు ముందుకువస్తున్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సైతం ఉపాధి హామీ పనులను స్వయంగా పర్యవేక్షిస్తుండటం, కూలీలు సామాజిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. పలు చోట్ల ఆకస్మీక తనిఖీలు  చేస్తున్నారు.

విపత్కర సమయంలో నిరుపేద కూలీలకు పని కల్పనలో కామారెడ్డి,రంగారెడ్డి,మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, జనగామ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. కూలీలు పని ప్రదేశానికి వాహనాలలో వెళ్లేటప్పుడు దూరంగా ఉండేలా చూడటంతో పాటు పనిచేసే చోట కూడా సామాజిక దూరం పాటించేలా పంచాయతీ కార్యదర్శులు,టీఏలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

ఈసారి ఉపాధి హామీ పనులు మొదలైనప్పటి అత్యధిక వేతనం రూ. 205గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అత్యధిక వేతనాన్ని రూ.211 నుంచి రూ.237కు పెంచారు. మొత్తంగా విపత్తు సమయంలో కూలీలకు వరంలా మారింది ఉపాధి హామీ పథకం.

- Advertisement -