బీహార్‌లోని మహువా అసెంబ్లీ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వీ యాదవ్ మరియు తేజ్ ప్రతాప్ యాదవ్ మధ్య కుటుంబ పోటీ నెలకొంది. తేజ్ ప్రతాప్ పోటీ చేస్తున్న మహువాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు తేజస్వీ. ఆర్‌జేడీ అభ్యర్థి ముకేశ్ రోషన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎవరొచ్చినా, ఎవరుపోయినా పెద్ద తేడా లేదు. ముఖ్యమైంది పార్టీ అన్నారు.
పార్టీ కన్నా గొప్పది ఎవరూ లేరు… పార్టీనే తల్లి, తండ్రి. పార్టీ లేకపోతే ఎవ్వరూ ఏమీ కాదు. మహువా టికెట్ లాలూ యాదవ్ ఇచ్చారు. ఇక్కడ లాంతరు వెలిగితేనే ప్రభుత్వం ఏర్పడుతుంది అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శిస్తూ గుజరాత్‌లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఓట్లు తెచ్చుకోవచ్చేమో కానీ, ఆ విధానంతో బీహార్‌లో ప్రభుత్వం రాదు అన్నారు.
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహువా ఒక కీలక సీటుగా మారింది. ప్రస్తుత ఎమ్మెల్యే మళ్లీ ఆర్‌జేడీ తరఫున పోటీ చేస్తుండగా, ఆయనకు ఎల్‌జేపీ అభ్యర్థి సంజయ్ సింగ్ మరియు తేజ్ ప్రతాప్ యాదవ్ నుంచి గట్టిపోటి ఎదురవుతోంది. బీహార్‌లో రెండు దశల్లో అఎంబ్లీ ఎన్నికలు జరగనుండడగా నవంబర్ 6 మరియు నవంబర్ 11న పోలింగ్…ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది.
Also Read:అదృష్టమంటే…ఇతడిదే!

