ఒక్క ట్రిప్పుకే.. రూపు మార్చేశారు!!

257
Tejas Express 1st Mumbai-Goa trip
- Advertisement -

200 కి.మీ. వేగం, ఆటోమేటిక్ డోర్లు, హెడ్‌ఫోన్లు, టీవీ స్క్రీన్లు, టీ-కాఫీ వెండింగ్ మెషీన్లు, వాక్యూమ్ బయో టాయిలెట్లు, ముట్టుకోకుండాలనే నీళ్లిచ్చే పంపులు… ఇలా రకరకాల అధునాతన సౌకర్యాలతో జనాలను ఆకర్షించిన తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు…. ఒక్క ట్రిప్పులోనే గుడ్లు తేలేసింది. విలాసవంతమైన ఈ రైలును సోమవారం ముంబయిలోని ఛత్రపతి శివాజీ టెర్మినల్‌లో కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు జెండా వూపి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తొలిసారి ముంబై నుంచి గోవా బయల్దేరి వెళ్లిన ‘తేజస్’… గోవా నుంచి మంగళవారం తిరిగి ముంబై వచ్చిన తేజస్‌ రైలును చూసి అధికారులు షాక్ తిన్నారు. దాదాపు 12 హైక్వాలిటీ హెడ్‌ఫోన్లు చోరీకి గురికాగా.. కొన్ని టీవీ స్క్రీన్లు బాగా గీతలు పడిపోయాయి. రెండు చోట్ల అద్దాలు పగిలిపోయి కనిపించాయి. ఎక్కడ చూసినా రైలు చెత్తతో నిండిపోయి దర్శనమిచ్చింది. నష్టం తీవ్రత చూసి విస్మయం వ్యక్తం చేశారు.

Tejas express damage

 కంగుతున్న అధికారులు రైల్లోని సామగ్రికి ఎటువంటి నష్టం కలిగించొద్దని అధికారులు ప్రయాణికులను విజ్ఞప్తి చేశారు. రెండో రోజు ఆ రైలు ఎక్కిన ఓ ప్రయాణికుడు.. ‘రైల్లోని మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయి, వాటిని పట్టించుకునేందుకు ఎవరూ రాలేదు. రైల్లో అందించే ఆహారం కూడా నాణ్యంగా లేదంటూ ఫిర్యాదు చేశాడు.

Tejas express damage

రైలు ప్రత్యేకతలు..
తేజస్ రైలు ఇప్పటి వరకు భారతీయ రైల్వేలో వచ్చిన అన్ని ట్రెయిన్‌ల కన్నా విలాసవంతమైంది. ఇందులో ఆటోమేటిక్ డోర్స్, ఎల్‌సీడీ తెరలు, వైఫై, టీ, కాఫీ మెషిన్లు, మ్యాగజైన్స్, బయో టాయిలెట్స్, హ్యాండ్ డ్రయర్స్ వంటి ఆధునిక సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. ఈ రైలు గంటకు గరిష్టంగా 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ముంబై నుంచి గోవా వరకు మొత్తం 579 కిలోమీటర్ల దూరాన్ని ఈ ట్రెయిన్ కవర్ చేస్తుంది. అందుకు గాను ఈ రైలుకు దాదాపుగా 8 గంటల సమయం పడుతుంది. త్వరలో ఢిల్లీ-చండీగడ్, ఢిల్లీ-లక్నో మార్గాల్లో కూడా ఇలాంటి రైళ్లను నడపనున్నారు.

- Advertisement -