సైజులు తగ్గిస్తున్న సెక్సీబ్యూటీ..

286
- Advertisement -

బొద్దుగా ఉంటేనే ముద్దన్నట్లు భారీగా శరీరాన్ని పెంచేసింది నమిత..అవకాశం వచ్చిందే తడువుగా  భాషతో సంబంధం లేకుండా వెండితెరపై నిండుగా అందాలను ఆరబోసేసి కుర్రకారు గుండెల్లో హీట్‌ పుట్టించేసింది. అయితే ఇప్పడు తన అందాలను కొత్తగా చూపించడానికి రెడీ అవుతోంది ఈ అమ్మడు. అందుకే సడెన్ గా బరువుతగ్గి స్లిమ్ గా తయారైంది. టాలీవుడ్ మూవీ సొంతం తో సినీ రంగానికి పరిచయమైన నమిత,
 Namitha Gets Slimmer, Opens Up About Her Depression
ఆ తర్వాత వరుసగా తెలుగుతో పాటు.. తమిళ్ ఆఫర్స్ కూడా దక్కించుకుని ఎక్కువగా కోలీవుడ్ లోనే సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు తెలుగులో కూడా మెరుస్తున్నా.. మెల్లగా ముద్దుగుమ్మ నుంచి బొద్దుగుమ్మగాను.. ఆ తర్వాత భారీ సైజుల్లోకి మారిపోయింది. తన కొలతలు ఎంతగా పెరిగినా.. అంతకు అంత రాణించిన ఈ బ్యూటీకి ఆఫర్స్ బాగానే వచ్చాయి.

తన భారీ అందాలతోనే తెలుగులో సింహ వంటి బ్లాక్ బస్టర్స్ లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ భారీ అందాల భామ సన్నబడిపోయేందుకు తెగ కష్టపడిపోతోంది. కొన్ని నెలలుగా జిమ్ లో వర్కవుట్స్ చేస్తున్న నమిత.. తాజాగా తన ఫిగర్ ను ఫోటో తీసుకుని నెట్ లో పెట్టేసింది.

Namitha Gets Slimmer, Opens Up About Her Depression

ఇప్పటికీ బొద్దుగానే ఉంది కానీ.. భారీ సైజుల నుంచి నమిత అందాలు కాసింత తగ్గిపోయిన మాట అయితే వాస్తవమే. కాసింత చిక్కిన సైజులతో నమిత అందాలు మరింతగా మిలమిల్లాడుతున్నాయని.. అభిమానులు తెగ హుషారెత్తిపోతున్నారు.

రీసెంట్ గా ఈ భామ మన్యం పులి చిత్రంతో మంచి సక్సెస్ ను సాధించగా.. ప్రస్తుతం పొట్టు అనే చిత్రంలో నటిస్తోంది నమిత. ఇక గ్లామర్ రోల్స్ నే కాదు పెర్ఫార్మెన్స్ లోనూ తన తడాఖా ఏంటో చూపిస్తానంటోంది. మొత్తానికి నమిత కి కొత్త అందం వచ్చిచేరింది. నమిత కాస్త సన్నబడ్డ  తర్వాత ఫ్యాన్సంత తెగ సంబరపడిపోతున్నారు.

- Advertisement -