ఆసక్తినరేపుతున్న ‘ఇష్క్’ ట్రైలర్‌..

186
- Advertisement -

ఇటీవ‌ల ‘జాంబీ రెడ్డి’ మూవీతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో తేజ స‌జ్జా ప్రస్తుతం ‘ఇష్క్‌` అనే చిత్రంతో ప్రేక్షకుల ముందు వస్తున్నాడు. నాట్ ఎ ల‌వ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌. ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రానికి య‌స్‌.య‌స్‌. రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆర్‌.బి. చౌద‌రి స‌మ‌ర్పణ‌లో ఎన్వీ ప్ర‌సాద్‌, పార‌స్ జైన్‌, వాకాడ అంజ‌న్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్స్‌, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ నెల 30న ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్‌ను వదిలింది చిత్రబృందం. హీరో.. హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటాడు. అయితే అదే సమయంలో ఆయనకి కొందరు వ్యక్తులు తారసపడతారు. అప్పటి నుంచి ఆయన మూడ్ మారిపోతుంది. అందుకు కారణం ఏమిటి? ఆయన గతంలో వాళ్ల పాత్ర ఏమిటి? అనేదే ఈ చిత్ర కథ.

ఈ ట్రైలర్ చూస్తే .. ఈ సినిమాకి ‘నాట్ ఏ లవ్ స్టోరీ’ అనే టైటిల్‌ను ఎందుకు సెట్ చేశారనేది తెలుస్తుంది. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉండి, సినిమాపై అంచనాలు పెంచుతోంది. దర్శకుడు రాజు కొత్త కాన్సెప్టును ఎంచుకున్నాడనే అనిపిస్తోంది. ఈ మూవీకి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా, ఎ. వ‌ర‌ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా, విఠ‌ల్ కొస‌నం ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ‌ర్క్ చేస్తున్నారు.

https://youtu.be/1ilVF7mL0wM
- Advertisement -