‘హను-మాన్’ నుండి ఆసక్తికరమైన అప్‌డేట్..

86
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో రూపొందుతున్న చిత్రం ‘హను-మాన్’. ‘జాంబి రెడ్డి’ సినిమాతో తేజ సజ్జాను హీరోగా పరిచయం చేసి సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ డైరెక్టర్.. మరోసారి తేజ సజ్జాతో ‘హను-మాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది చిత్రబృందం.

ఈనేపథ్యంలో ఈ మూవీ నుంచి మరో ఆసక్తికరమైన పోస్టర్‌ను వదిలి అప్‌డేట్ ఇచ్చాడు దర్శకుడు. డిసెంబర్ 13న ఉదయం 10.35 నిమిషాలకు ‘అంజనాద్రి నుంచి మీనాక్షిని కలవండి!’ అంటూ ఓ ఆసక్తికరమైన పోస్టర్ విడుదల చేసి ప్రమోషన్స్‌ను మొదలుపెట్టారు. కాగా, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

- Advertisement -