రానాతో ‘జయమ్మ పంచాయితీ’ టీజర్‌..

59

టాలీవుడ్‌ యాంకర్, టెలివిజన్ ప్రజెంటర్, హోస్ట్ సుమ ప్రస్తుతం ‘జయమ్మ పంచాయితీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు. ఫస్ట్ లుక్‌కు విశేషమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుండి టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌ను హీరో రానా దగ్గుబాటి ఆదివారం విడుదల చేశారు.

ఇక టీజర్‌ విషయానికొస్తే.. ఇది పల్లెటూరి నేపథ్యం ఉన్న సినిమా. ఆంధ్రా పల్లెల్లో సీన్ అంతా కనిపిస్తోంది. బుర్రకథను కూడా చూపించారు కాబట్టి కథాంశం కాస్త పాత కాలం నాటిదేనని భావించవచ్చు. అసలు ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఇలాంటి గొడవ జరిగి ఉండదు అని ఊరి పెద్దలు అంటున్నారు. ఇంతకీ జయమ్మ పంచాయితీ కథాకమామీషు ఏంటో కానీ అంటే.. కాస్త గడుసరిగానే వ్యవహరిస్తోంది. రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు పెద్దలు ఉండరు! అంటూ జయమ్మ గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. నీ దగ్గర డబ్బు ఎలా వసూలు చేయాలో తెలుసు! అంటూ ఒక పెద్దమనిషిని దబాయిస్తోంది. ఊళ్లో ఇళ్ల స్కీమ్ ల గురించి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేనా.. నీ మొగుడు మంచాన పడ్డాడు! అంటే.. నా మొగుడు నా మంచాన పడ్డాడు! అంటూ గడుసుగానే సమాధానమిచ్చింది. మొత్తానికి జయమ్మ వసూళ్ల పంచాయితీ కథేమిటో కానీ ఆసక్తిని కలిగిస్తోంది.

ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి అద్భుతమైన బాణీని అందించగా.. పీవీఎన్ఎస్ రోహిత్ ఆలపించారు. రామాంజనేయులు మంచి సాహిత్యాన్ని రచించారు. సంగీత ప్రియులను ఈ పాట ఆక‌ట్టుకుంటోంది. విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 2గా రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. అనుష్ కుమార్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి కావొస్తుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించబోతోన్నారు.

Jayamma Panchayathi Teaser | Suma Kanakala | M.M.Keeravaani | Balaga Prakash | Vijay Kalivarapu