మరోసారి బుల్లితెరపై ఎన్టీఆర్…

274
ntr d10

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి బుల్లితెరపై దర్శనమివ్వనున్నాడు. బిగ్ బాస్‌ సీజన్ 1 కి హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్‌ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండటంతో బిగ్ బాస్ రెండో సీజన్‌కి హోస్ట్‌గా చేయలేదు. అయితే తారక్ మరోసారి బుల్లితెరపై కనువిందు చేయనున్నాడు. అయితే హోస్ట్‌గా మాత్రం కాదు.

డాన్స్ ప్రధానంగా సాగే ఢీ 10 ఫైనల్స్ కి అతిథిగా రానున్నారు. ఢీ 10 కార్యక్రమానికి ప్రియమణి,శేఖర్ మాస్టర్,యాని మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తుండగా యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా చేస్తున్నాడు. మల్లెమాల ఎంటర్టైన్ మెంట్స్ ఈ షోని నిర్మిస్తుండగా ఇటీవలే షూటింగ్ జరిగిన ఈ షోలో ఎన్టీఆర్ స్టెప్పులేసి అలరించాడు.

జై లవ కుశ సినిమాలోని రావణా సాంగ్ కి ఎన్టీఆర్ డాన్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఇక ఎన్టీఆర్ ఎంట్రీ సందర్భంగా సుదీర్,రేష్మి చేసిన హంగామా చూసి తీరాల్సిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం అరవింద సమేత సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో ఉండటంతో పాటు తారక్‌ మరోసారి తండ్రైన సంగతి తెలిసిందే. మొత్తంగా తారక్‌ ఎంట్రీతో ఢీ 10 ఫైనల్‌కి మంచి టీఆర్పీ రేటింగ్స్ రావడం మాత్రం ఖాయమనే చెప్పుకోవాలి.