బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు పార్టీలో అంతర్గత పోరు మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి…ఇలా వరుస షాక్‌లతో ఉన్న బండికి మరో షాక్ తగిలింది. నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నుండి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్న చివరలో తీన్మార్ మల్లన్నకు అంతర్గతంగా మద్దతిచ్చి టీఆర్ఎస్‌ను ఓడించేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయితే పట్టభద్రులు మాత్రం టీఆర్ఎస్‌కు ఓటేసి సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చారు.
అయితే ఈ క్రమంలో ఎన్నికల ఒప్పందంలో భాగంగా తీన్మార్ మల్లన్న ఎన్నికల అనంతరం బీజేపీలో చేరుతారని, ఆపార్టీ నేతలే బహిరంగంగా ప్రచారం కూడా చేశారు. అంతేగాదు తీన్మార్ ఎన్నికల ఖర్చును కూడా భరించారట కాషాయ నేతలు. ఇందుకు ఓ ఎంపీ తనవంతు పాత్ర పోషించారట.
ఇంతలోనే సాగర్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మల్లన్నను తమ పార్టీ నుండి పోటీచేయించాలని బండి స్కెచ్ వేశారు. అయితే బండి అండ్ కోకి కోలుకోలేని విధంగా షాకిచ్చి తప్పుకున్నారు మల్లన్న. తానే ఏ పార్టీలో చేరనని..తనను బీజేపీ పార్టీ నేతలు సంప్రదించిన మాత్రం నిజమే కానీ తాను ఏ పార్టీ కండువా కప్పుకునేది లేదని ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. దీంతో అసలే ఓటమితో ఢీలా పడి బండిపై కోపంతో ఉన్న కాషాయ క్యాడర్….తాజా పరిణామాలతో మరింత ఆగ్రహంతో ఉన్నారట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఉన్నా అంతర్గతంగా మల్లన్నకు మద్దతి బండి అవగాహనలేని రాజకీయాలతో పార్టీ పరువు తీస్తున్నారని నేతలు విమర్శలు గుప్పిస్తున్నారట. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు బండికి కంటగింపుగా మారాయి. అయితే ప్రస్తుతానికి చింతపండు నవీన్ బీజేపీలో చేరడం కాస్త ఆలస్యమైనా ఎప్పటికైనా కమలం గూటికి వస్తారని చెబుతున్నారట బండి.