వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలవగా కాంగ్రెస్ నుండి చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న పోటీలో ఉన్నారు. ఇక బీజేపీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.
నిన్న కాంగ్రెస్ తరపున తన నామినేషన్ దాఖలు చేశారు తీన్మార్ మల్లన్న. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. తనకు కోటీ 50 లక్షల రూపాయల ఆస్తి ఉందని వెల్లడించారు. అయితే నామినేషన్ కంటే ముందే తన ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చేశారు మల్లన్న.
గత అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ టికెట్ ఆశీంచారు మల్లన్న కానీ దక్కలేదు. అయితే గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా ఇదే స్థానం నుండి పోటీ చేశారు మల్లన్న. కానీ విజయం మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని వరించింది. ఇక ఆతర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు పల్లా. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
Also Read:విశాఖలో దేవర!