ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లిన టీమిండియా ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. 23 మంది క్రికెటర్ల బృందంలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత 20 రోజుల బ్రేక్ దొరకడంతో ఈ గ్యాప్‌లో ప్లేయర్స్ యూకేలో సైట్ సీయింగ్‌కు వెళ్లారు. దీంతో ఆ ప్లేయర్ కొవిడ్ బారిన పడ్డాడు.
డర్హమ్‌లో టీమిండియా మరోసారి బయోబబుల్‌లోకి వెళ్లనుంది. ఇంగ్లండ్‌తో సిరీస్ ఆగస్ట్ 4న ప్రారంభమవుతుంది. ఒక ప్లేయర్ కరోనా బారిన పడిన మాట నిజమే. అయితే అతనికి పెద్దగా లక్షణాలేమీ లేవు. ప్రస్తుతం అతడు క్వారంటైన్‌లో ఉన్నారని బీసీసీఐ అధికారులు వెల్లడించారు.
యూకేలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ మధ్యే బీసీసీఐ సెక్రటరీ జే షా ఇండియన్ టీమ్ సభ్యులకు మెయిల్ పంపించడం గమనార్హం. వాస్తవానికి ప్లేయర్స్ కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నా కూడా.. దాని నుంచి పూర్తి రక్షణ ఉండదని, యూరో, వింబుల్డన్ లాంటి టోర్నీలకు వెళ్లొద్దని బీసీసీఐ చెప్పినా కొందరు వినలేదు.