దక్షిణాఫ్రికాకు టీమిండియా..

86
bcci

దక్షిణాఫ్రికాకు బయలుదేరింది టీమిండియా. ఓ వైపు ఒమిక్రాన్ కేసులు విజృంభిస్తుండగా అసలు సిరీస్ జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొనగా వాటికి చెక్ పెడుతూ సిరీస్ జరుగుతుందని క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ…టీమిండియాను దక్షిణాఫ్రికాకు పంపింది.

ఈరోజు భారత ఆటగాళ్లు అందరూ సౌత్ ఆఫ్రికా పయనమయ్యారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆటగాళ్లు విమానంలో ఉన్న ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. సౌత్ ఆఫ్రికా కు చేరుకున్న తర్వాత మూడు రోజుల పాటు క్వారంటైన్ లో ఉండనుంది. ఆ తర్వాత ఓమిక్రాన్ మధ్య కట్టుదిట్టమైన బయో బబుల్ లో రెండు జట్లు మొదట టెస్ట్ సిరీస్ లో తలపడనున్నాయి.