కరేబియన్ దీవుల్లో కూలిన విమానం..

123
carebien

కరేబియన్‌ దీవుల్లోని డొమినికన్‌ రిపబ్లిక్‌లో విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఇద్దరు సిబ్బంది సహా ఏడుగురు ప్రయాణికులతో ఓ ప్రైవేట్‌ విమానం.. డొమినికన్‌లోని లా ఇసబెల్లా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నుంచి ఫ్లోరిడా వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

టెకాఫ్‌ అయిన కేవలం 15 నిమిషాలకే శాంటో డొమింగోలోని లాస్‌ అమెరికాస్‌ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరం ల్యాండ్‌ చేశాడు పైలట్.. ఇదే సమయంలో విమానం పేలిపోయింది.ఈ ప్రమాదంపై అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు.