జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత పురుషుల క్రికెట్ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకుంది. సెమీఫైనల్ పోరులో శ్రీలంకపై సాధించిన భారీ విజయంతో, అంతర్జాతీయ టీ20 (T20I) ఫార్మాట్లో 100 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది.
పొట్టి ఫార్మాట్ (T20I) చరిత్రలో 100 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో విజయం సాధించడం భారత్కు ఇది 11వ సారి. దీంతో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక సార్లు 100+ పరుగుల భారీ తేడాతో గెలిచిన జట్టుగా భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
పోటీ తీవ్రంగా ఉంటుందని భావించినప్పటికీ, సెమీఫైనల్లో శ్రీలంకను భారత్ లీలామాత్రంగా ఓడించింది. ఇషాన్ కిషన్ అద్భుతమైన అర్ధశతకంతో (80 నాటౌట్) రాణించడంతో భారత్ మొదట 169 పరుగులు చేయగా, అనంతరం బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అభిషేక్ శర్మల దాటికి శ్రీలంకను కేవలం 45 పరుగులకే ఆలౌట్ చేసింది.
Also Read:దానంకు ఎంపీ..నాకు ఎమ్మెల్యే టికెట్!
ఈ చారిత్రాత్మక విజయంతో ఆసియా క్రీడల్లో భారత్ ఫైనల్కు అర్హత సాధించింది. అక్టోబర్ 3న జరగబోయే హై-వోల్టేజ్ గోల్డ్ మెడల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో టీమిండియా తలపడనుంది.

