దానంకు ఎంపీ..నాకు ఎమ్మెల్యే టికెట్!

9
- Advertisement -

దివంగత ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) వారసురాలిగా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న తనను ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సరైన స్థానంలో గుర్తిస్తుందని కాంగ్రెస్ నేత విజయారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో పీజేఆర్ ముద్ర చెరగనిదని ఆయన పేరు లేకుండా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్లలేదని ఆమె స్పష్టం చేశారు.

పార్టీ రాజకీయ సమీకరణలు, టికెట్ల కేటాయింపు పై మాట్లాడిన విజయారెడ్డి.. సీనియర్ నాయకుడు దానం నాగేందర్‌ను ఎంపీ అభ్యర్థిగా జాతీయ రాజకీయాలకు పంపించి తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. పీజేఆర్ అందించిన ప్రజా సేవలను గుర్తుచేసుకుంటున్న ప్రజలు, ఈ సారైనా ఆయన బిడ్డకు కాంగ్రెస్ పార్టీలో సరైన న్యాయం జరుగుతుందని భావిస్తున్నారని చెప్పారు.

Also Read:BB10:పవన్ – రీతూ బ్రేకప్ వివాదం!

రాబోయే ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటూనే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ అధిష్టానం తనకు తగిన ప్రాధాన్యత ఇస్తుందనే నమ్మకంతో ఉన్నట్లు విజయారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -