- Advertisement -
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది రోహిత్ సేన. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మూడో వన్డేలోనూ భారత్ గెలుపొందింది.భారత్ విధించిన 266 పరుగుల లక్ష్య చేదనలో విండీస్ కేవలం 169 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 96 పరుగుల తేడాతో విజయం సాధించింది.
విండీస్ బ్యాట్స్‌మెన్ అంతా చేతులెత్తేయడంతో కేవలం 37.1 ఓవర్లలో 169 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, కృష్ణ చెరో మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు.
అంతకముందు బ్యాటింగ్ చేసిన భారత్ 265 పరుగులు చేసింది. శ్రెయాస్ అయ్యర్ 80, రిషబ్ పంత్ 56, దీపక్ చాహర్ 38, వాషింగ్టన్ సుందర్ 33, కెప్టెన్ రోహిత్ శర్మ 13, శిఖర్ ధావన్ 10 పరుగులు చేశారు.
- Advertisement -