IND vs ENG :శ్రేయాస్ అయ్యర్ పై వేటు?

24
- Advertisement -

ఈ నెల 15 నుంచి టీమిండియా మరియు ఇంగ్లాండ్ మద్య మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మొదటి రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరో విజయాన్ని ఖాతాలో వేసుకొని సమంగా నిలిచాయి. దాంతో మూడో టెస్టులో విజయం కోసం ఇరు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. అయితే థర్డ్ టెస్ట్ కు ముందు టీమిండియాలో మార్పులు చేరేందుకు సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గత రెండు టెస్ట్ లలో విఫలం అయిన శ్రేయస్ అయ్యర్ ను పక్కన పెట్టె ఆలోచనలో ఉన్నారట. అయితే శ్రేయస్ అయ్యర్ గతంలో భాదించిన వెన్నునొప్పి మళ్ళీ తిరగబెట్టడంతో అతడి ఫిట్ నెస్ పై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ రెండు టెస్ట్ లలో విఫలం కావడం ఒక కారణమైతే, అతడి వెన్నునొప్పి కూడా తోడవడంతో శ్రేయస్ ను పక్కన పెట్టడమే మంచిదని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.

అతడి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ లేదా రజిత్ పాటిదార్ కు చోటు కల్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక గాయం కారణంగా మొదటి రెండు టెస్ట్ లకు దూరమైన కే‌ఎల్ రాహుల్, రవీంద్ర జడేజా మూడో టెస్టు కు అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరు జట్టులోకి ఎంట్రీ ఇస్తే మరో ఇద్దరు ప్లేయర్స్ పై వేటు పడడం ఖాయం. అయితే ఎవరిపై వేటు పడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. ఇకపోతే రెండో టెస్ట్ లో రాణించిన జైస్వాల్, గిల్ మూడు టెస్ట్ లో కూడా రాణిస్తే జట్టుకు భారీ స్కోర్ వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు రోహిత్ శర్మ కూడా లయ అందుకోవడం ముఖ్యం ఎందుకంటే గత కొన్నాళ్లుగా టెస్టుల్లో రోహిత్ ఘోరంగా విఫలం అవుతున్నాడు. దాంతో మూడో టెస్టుతోనైనా ఫామ్ లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Also Read:శ్రీను వైట్ల కష్టాలు ఇన్ని అన్ని కావు

- Advertisement -