- Advertisement -
టీమిండియా ఆల్ రౌండర్ ప్లేయర్ హార్దిక పాండ్యా సోషల్ మీడిమాలో చాలా చురుకుగా ఉంటాడన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మాజీ కెప్టెన్ ధోనితో కలిసి ఓ వీడియో చేశాడు. ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. స్టార్ నెట్‌వర్క్ తమ చానెల్స్ ప్యాకేజీని ప్రమోట్ చేసేందుకు ఈ యాడ్‌ను రూపొందించింది. ఓ చెట్టుపై కూర్చొని బైనాక్యులర్స్‌లో దూరంగా జరుగుతున్న మ్యాచ్‌ను ఈ ఇద్దరు క్రికెటర్లు చూస్తున్నట్లుగా యాడ్‌ను చిత్రీకరించారు. ధోనీ ఇందులో బిట్టూ భయ్యాగా కనిపించాడు.ఈ వీడియోను పాండ్యా తన ట్విటర్‌లో షేర్ చేశాడు. కేవలం రూ.49కే స్టార్ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని చానెల్స్ వస్తాయని చెప్పడమే ఈ యాడ్ ఉద్దేశం.
Gajab… @msdhoni #SachMein! @starindia #StarValuePack pic.twitter.com/poqMUJ5qi2
— hardik pandya (@hardikpandya7) December 30, 2018
- Advertisement -