మాజీ ఎంపీ, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడి నామా నాగేశ్వర్ రావు ఆ పార్టీకీ రాజీనామా చేశారు. పార్టీకీ సరైన నాయకత్వం లేకపోవడంతో నామా కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మహాకూటమి తరపున ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయారు. పొలిట్‌బ్యూరో పదవితో పాటు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. నామా టీడీపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. తెలంగాణలో టిడిపికి భవిష్యత్ లేదన్న కారణంతో ఆయన టిఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ అయినట్టు తెలుస్తుంది.
నామా ను పార్టీలో చేర్చుకునేందుకు గులాబీ బాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఖమ్మం పార్లమెంట్ స్ధానం నుంచి నామా నాగేశ్వర్ రావు ను పోటీలో ఉంచేందుకు కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా టీడీపీలో నామకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండటంతో పార్టీకీ కలిసోస్తుందని ఆశిస్తున్నారు సీఎం కేసీఆర్. నామా చేరిక వల్ల ఖమ్మంలో పార్టీ మరింత బలోపేతమవ్వనుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ శ్రేణులు. ఇక ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతుంది.