- Advertisement -
టీడీపీ మహానాడును కడపలో నిర్వహించాలని నిర్ణయించారు ఏపీ సీఎం చంద్రబాబు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామన్నారు చంద్రబాబు.
రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోంది..తిప్పికొట్టండని శ్రేణులకు సూచించారు.
Also Read:యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు
- Advertisement -

