50 ఏళ్లు హీరోగా ఈ ప్రపంచంలో ఎవడూ లేడు.. నేను తప్ప అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నందమూరి బాలకృష్ణ. తెలుగు జాతి అండతోనే తాను హీరోగా మనగలుగుతున్నానని వెల్లడించారు. తనకు పద్మభూషణ్ పురస్కారం దక్కినందుకు సంతోషంగా ఉంది కానీ నా తండ్రి ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అనేది తెలుగువారందరి కోరిక. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్లను వాళ్లు గౌరవించుకున్నట్టు అని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అన్నారు.
4 సినిమాలు, వరుసగా హిట్లు.. అఖండ, వీరసింహా రెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహరాజ్.. నాలుగు వరుస హిట్లు.. 50 సంవత్సరాలు హీరోగా చేసిన వారు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు అన్నారు. ఏం చూసుకుని బాలకృష్ణకు అంత పొగరు అంటారు. నన్ను చూసుకునే నాకు అంత పొగరు అని తెలిపారు.
నన్ను నేను తెలుసుకునే కంటే పెద్ద విద్య లేదని ఒక సవాల్ గా నిలబడతాను… నా మాట ముక్కు సూటిగా ఉంటుందన్నారు. నా తీరు గాంభీర్యంగా ఉంటుంది కానీ నా మానవత్వం, వ్యక్తిత్వం, నీతి, నిజాయితీ, నిబద్దత, నిష్కల్మషం అని చెప్పుకొచ్చారు.
Also Read:యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు

