నిత్యావసర ధరల పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ధర్నాలు..

91
- Advertisement -

నిత్యావసర సరుకుల ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి,సామాన్యూడి నడ్డి విరుగుతున్న ప్రభుత్వంలో చలనం లేదు అంటు బీకే పార్థసారథి ఆగ్రహం వ్యక్థం చేశారు. ఏపీలో టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దర్నాలు చేపట్టారు. అనంతపురం జిల్లా పెనుకొండలో మంగళవారం తేదేపా ధర్నా నిర్వహించింది. ఎన్టీఆర్ సర్కిల్ నుండి ర్యాలీగ వచ్చి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. కాయగూరలు,వంట నూనే,గ్యాస్ సిలెండర్ ముందు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగ నినాదాలు చేశారు. నిత్యావసర సరుకులు రోజు పెరిగిపొతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది,ప్రజలపై కొంచేం కూడా దృష్టి లేకుండా పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్నాడు,సినిమా టికెట్ రేట్లు తగ్గించడంలో ఉన్న శ్రధ్ధ సామాన్యుడి మీద లేదంటు మండి పడ్డారు. ఈ ధర్నా కార్యాక్రమంలో తేదేపా రాష్ర్ట కార్య నిర్వాహకురాలు సవిత,సుబ్బరత్నమ్మ,శ్రీరాములు,శశిభూషన్,మునిమడుగు వెంకటరాముడు,గోపి,ఐదు మండలాల కన్వీనర్ లు,నాయకులు,కార్యకర్తలు పాల్గోన్నారు.

- Advertisement -