2 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’..

16

సూపర్ స్టార్ మహేష్ బాబు రెండెళ్ల క్రితం సంక్రాంతి సందర్భంగా విడుదలై సినీ ప్రేమికుల హృదయాలను గెలుచుకున్న యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. మహేష్ బాబు చివరిసారిగా ఈ చిత్రంతోనే ప్రేక్షకులను పలకరించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మహేష్ బాబుతో రష్మిక మండన్న మొదటిసారి కలిసి నటించింది. విజయశాంతి కీలకపాత్రలో నటించింది. అయితే ఈ సినిమా నేటితో (జనవరి 11) ఈ సినిమా విడుదలై 2 సంవత్సరా పూర్తయ్యింది.

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు అనీల్ రావిపూడి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. జనవరి 11, 2020 సరిలేరు నీకెవ్వరు గుర్తు పెట్టు కోవాల్సిన రోజు, గుర్తు ఉండి పోయే రోజు. సరిలేరు నీకెవ్వరు కరెక్ట్ గా నేటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా టీమ్ తరుపున తెలుగు ప్రేక్షకులకు, మహేష్ గారి అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు`అంటూ ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.