శ్రీకాకుళంలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి..

49
- Advertisement -

శ్రీకాకుళం జిల్లాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ 26 వర్ధంతిని తెలుగుదేశం నేతలు ఘనంగా నిర్వహించారు. మూడో విడత కోవిడ్ వ్యాప్తి చెందుతున్న తరుణంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారు.టిడిపి పాలిట్ బ్యూరో సభ్యులు తన ఇంటివద్దే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్ ఆముదాలవలసలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. అలాగే పాలకొండలో పార్టీ ఇన్ చార్జి నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షులు కూన రవి కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీ ఆర్ పేదల పక్షపాతి అని కొనియాడారు. తెలుగువారి జాతి ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన మహా వ్యక్తి అని కొనియాడారు. పాలకొండలో టిడిపి ఇన్ చార్జి నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యు న్నతి,తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలు నలుదిశలా వ్యాప్తి చెందేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి ప్రశంసనియ మన్నారు.

- Advertisement -