ఇకపై పవన్ తో పాటే..?

49
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నాలుగో విడతను అవనిగడ్డలో నేటి నుంచి ప్రారంభించారు. ఇప్పటికే మూడు విడతల్లో యాత్రను పూర్తి చేసిన పవన్.. ఉత్తరాదిన విస్తృతంగా పర్యటించారు. వారాహి యాత్ర కారణంగా ప్రజల దృష్టిని కొంత జనసేన వైపు తిప్పుకోగలిగారు పవన్ కల్యాణ్. అయితే ఇటీవల పవన్ ఎవరు ఊహించని విధంగా టీడీపీతో పొత్తు ప్రకటించి కొత్త రాజకీయానికి తెర తీశారు. కాగా పొత్తు కన్ఫర్మ్ అయినది మొదలు కొని ఈ రెండు పార్టీల వ్యూహరచన ఎలా ఉండబోతుందనే చర్చ తరచూ తెరపైకి వస్తోంది. అయితే ప్రస్తుతం టీడీపీ ఉన్న పరిస్థితుల్లో ఆ పార్టీ దూకుడు చాలా వరకు తగ్గింది. నారా లోకేశ్ కూడా తన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు.

దీంతో టీడీపీ మళ్ళీ ఎప్పుడు యాక్టివ్ అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి ఈ నేపథ్యంలో పవన్ చేపట్టే ప్రతి కార్యక్రమంలో టీడీపీ కూడా పాలు పొందేలా వ్యూహరచన జరుగుతున్నాట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నేడు నుంచి ప్రారంభం కానున్న వారాహియాత్రలో పవన్ తో పాటు టీడీపీ శ్రేణులు కూడా పాల్గొనాలని నారా లోకేశ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. దీంతో ఇకపై రెండు పార్టీలు ఏ కార్యక్రమాలు అన్నీ కార్యక్రమాలను, వ్యూహాలను కలిసే నిర్వహించనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే పవన్ తో పాటు టీడీపీ ఉండడం వల్ల ఏ పార్టీకి ఎక్కువ లాభం చేకూరుతుందంటే.. విశ్లేషకులు చెబుతున్న ప్రకారం జనసేనకే ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉందట. ఎందుకంటే టీడీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా ఆ పార్టీ నేతలు కాన్ఫిడెంట్ గా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం లేదు. కానీ పవన్ మాత్రం జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. టీడీపీకి మద్దతు ప్రకటించిన విషయంలోనూ కాన్ఫిడెంట్ ప్రదర్శించే అవకాశం ఉంది. అందుకే రెండు పార్టీలలో ప్రస్తుత పరిణామాల దృష్ట్యా జనసేనదే పైచేయి గా ఉంటుందనేది కొందరి అభిప్రాయం.

Also Read:విచారణకు రెడీ.. తాడో పేడో?

- Advertisement -